NEWS

Blogger Widgets

7.6.12

ఆ హాట్ లేడీ రేటు జస్ట్ 5 లక్షలే


తనీష్ హీరోగా వచ్చిన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీత ఆ తర్వాత సిద్దార్థ హీరోగా వచ్చిన ‘బావ’ చిత్రంలో కూడా నటించింది. అయితే ఈరెండు చిత్రాలు ప్లాపు కావడంతో ప్రణీతకు ఇక్కడ అవకాశాలు ఇచ్చే వారే కరవుయ్యారు.ఆ తర్వాత తన మాతృభాష కన్నడ, తమిళంలో ఒకటి అర సినిమా అవకాశాలు దక్కించుకుంటున్న ప్రణీతా తాజాగా తమిళ స్టార్ హీరో కార్తి సరసన శకుని చిత్రంలో అవకాశం దక్కించుకుంది. త్వరలో ఈచిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. ఇంతకీ ఈ సినిమాకు ప్రణీత పుచ్చుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా..? కేవలం రూ. 5 లక్షలు మాత్రమేనట. ఈ సినిమానే కాదు గత సినిమాలకు కూడా అమ్మడు తీసుకుంది ఇంతే నట.