ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న షరపోవా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 2007లో తొలిసారి, 2011లో రెండోసారి ఆమె ఈ టోర్నమెంట్ ఫైనల్ చేరింది. కాగా క్విటోవాతో శనివారం జరిగే ఫైనల్‌లోనూ గెలిస్తే షరపోవాకు టైటిల్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్ స్థానం కూడా దక్కుతోంది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సెమీఫైనల్లోకి చేరాడు. దాదాపు ఏకపక్షంగా జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో రఫెల్ నాదల్ నికోలస్ అల్మాగ్రోను 7-6, 6-2, 6-3 తేడాతో ఓడించి సెమీఫైనల్స్ బెర్తును ఖరారు చేసుకున్నాడు.