వరస విజయాలతో సూపర్ స్టార్ ఇమేజ్ ని చెక్కు చెదరనీయకుండా కాపాడుకుంటూ వస్తున్న మహేష్ త్వరలో నిర్మాతగా మారుతున్నారని సమాచారం. ఈ మేరకు ఆయన తన శ్రేయాభిలాషులతో చర్చిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అప్పట్లో మహేష్ తండ్రి కృష్ణ నిర్మాతగా మారి పద్మాలయా బ్యానర్ పై తనే హీరోగా అనేక సూపర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు అదే రూట్ లో మహేష్ కూడా ప్లాన్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే మహేష్ సోదరుడు రమేష్ ఆల్రెడీ నిర్మాతగా ఫీల్డ్ లో కొనసాగుతున్నాడు. అలాగే మహేష్ సోదరి మంజుల సైతం నిర్మాతగా సినిమాలు తీస్తోంది. అయితే తన సొంత బ్యానర్ పెట్టుకుని వరసగా సినిమాలు చేయాలనే ఆలోచనలతో ఉన్నట్లు చెప్తున్నారు. తన బ్రాండ్ ఇమేజ్ ని ఆ విధంగా వినియోగుంచుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. |