Jun-06-2012 08:37:58 | |
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ స్వీయ నిర్మాణంలో రూపొందిన సినిమా ‘ఆకాశమంత'. రాధా మోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం కలెక్షన్లు పెద్దగా రాబట్టలేక పోయినా....ఒక మంచి ఫీల్ గుడ్ చిత్రంగా ప్రకాష్ రాజ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఈచిత్రాన్ని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ చేయబోతున్నారు. ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రను అమీర్ పోషిస్తారని తెలుస్తోంది.
బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అమీర్‌కి ఇతర హీరోల కంటే ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. తన చేయబోయే సినిమా ఇటు ఎంటర్‌టైన్మెంట్‌తో, మెసేజ్ పుల్‌గా, ఫీల్ గుడ్‌గా ఉండేలా చూసుకుంటాడు. ఆయన ఏ పాత్ర పోషించినా దానికో అర్థం ఉంటుంది. ఆకాశమంత సినిమా చూసిన తర్వాత బాగా ఇంప్రెస్ అయిన అమీర్‌ఖాన్ ప్రకాష్ రాజ్ పోషించిన పాత్ర తనకు బాగా సూట్ అవుతుందని ఫిక్స్ అయ్యారట. |