NEWS

Blogger Widgets

7.6.12

మలయాళ డర్టీ పిక్చర్‌లో మిస్టర్ నూకయ్య భామ సనాఖాన్!



Sana Khan
FILE
విద్యాబాలన్ సిల్క్ స్మితగా హిందీలో నటించిన చిత్రం డర్టీ పిక్చర్. ఈ సినిమాలో విద్యాబాలన్ ప్రదర్శించిన గ్లామర్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. విద్యాబాలన్ గ్లామర్‌కు భారీ కలెక్షన్లు, అవార్డులు కావడంతో ఆ సినిమా రీమేక్‌కు రంగం సిద్ధమవుతోంది. ఉత్తరాది ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న ఈ డర్టీ పిక్చర్‌ను మలయాళంలో రీమేక్ చేయనున్నారు. 

సిల్క్ స్మిత కథను తీసుకుని మలయాళంలో దర్శకుడు అనిల్ తెరకెక్కించనున్నాడు. మలయాళంలో సిల్క్ పాత్రకు సనా ఖాన్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. ఆంటోనీ ఈ సినిమాకు స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడు. అయితే ఇది డర్టీ పిక్చర్‌కు రీమేక్ కాదని సినీ వర్గాల్లో టాక్. డర్టీ పిక్చర్‌లో సిల్క్ కథ తక్కువే వుంటుంది. 

అయితే మలయాళ డర్టీ పిక్చర్‌లో సిల్క్ స్మిత జీవిత కథకు సంబంధించిన వాస్తవాలు ఉంటాయని మూలీవుడ్ వర్గాల్లో టాక్. ఇందులో సిల్క్ స్మితగా గ్లామర్ క్వీన్ తమిళ సిలంబాట్టంలో నటించిన సనా ఖాన్ అందాలను ఆరబోయనుంది. ఈ భామ తెలుగులో మిస్టర్ నోకియా చిత్రంలో మంచు మనోజ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే.