NEWS

Blogger Widgets

7.6.12

ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్లో సానియా-మహేష్ జోడీ, పేస్ జంట నిష్క్రమణ!


Sania-Mahesh

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జోడీ సానియా మీర్జా-మహేష్ భూపతి జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే లియాండర్ పేస్- వెస్నీనా జోడీకి ఈ టోర్నీలో చుక్కెదురైంది.


బుధవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో మహేష్ భూపతి-సానియా మీర్జా జోడీ 6-4, 6-2 తేడాతో గలినా వొస్కోబొయేవా, డానియెల్ బ్రాసియాలి జోడీపై సులభంగా విజయం సాధించారు. ఒక గంట 10 నిమిషాలు పాటు సాగిన పోరులో గెలవడం ద్వారా సానియా, భూపతి మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడోసారి ఓ గ్రాండ్‌శ్లామ్ టోర్నీలో ఫైనల్ చేరారు. 

2008 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ఓటమిపాలై రన్నరప్ టైటిల్‌తో సరిపుచ్చుకున్న వీరు అదే టోర్నమెంట్ టైటిల్‌ను 2009లో గెల్చుకున్నారు. మూడేళ్ల తర్వాత మరోసారి ఓ గ్రాండ్‌శ్లామ్ టోర్నీ ఫైనల్ చేరారు. భూపతి ఖాతాలో ఇప్పటి వరకూ 11 మేజర్ టైటిల్స్ సాధించగా, వాటిలో ఏడు మిడ్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో వచ్చినవే కావడం విశేషం. 

అయితే లియాండర్ పేస్- ఆతని రష్యన్ భాగస్వామి ఎలెనా వెస్నీనా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో అన్ సీడెడ్ జంట క్లౌడి.యా-శాంటిగో జోడీ చేతిలో పేస్ జోడీ 7-6 (7-2), 6-3 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది.