గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఇటీవల జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశ సందర్భంగా చూపిన అతి చొరవ మొదటికే మోసాన్ని తెస్తున్నదా? పార్టీలో అంతర్గత కల్లోలాను, చీలికలను ఈ ఘట్టం మరింత తీవ్రం చేసిందా? పరిస్థితులను గమనిస్తే అంతర్గత కలహాలలో కాంగ్రెస్‌కు ధీటుగా బిజెపి తయారవుతుందనే భావన కలుగక మానదు.తమ అత్యుత్సాహం, చొరవ కారణంగా 2014 లోక్‌సభ ఎన్నికలలో నాయకత్వ అంశాన్ని పరిష్కరించామని మోడీ, ఆయన గ్యాంగ్ భావిస్తుండగా ఆ ఉత్సాహాన్ని నీరు కార్చేందుకు మోడీ వ్యతిరేకులు వాయువేగంతో స్పందిస్తున్నారు.ఈ తక్షణ దాడి రెండు కోణాల నుంచి ప్రారంభమైంది.ఒకటి స్వరాష్టమ్రైన గుజరాత్‌లో ఇప్పటికే అసమ్మతివాదిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ తాను పార్టీని విడిచిపోతానని బెదిరించారు.అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ ఉదంతం చోటు చేసుకోవడం మోడీకి అంత సానుకూల అంశం కాదు. ఈ గొడవను పరిష్కరించుకునేందుకు తగిన సమయాన్ని, కృషిని చేయకపోతే ముచ్చటగా మూడోసారి తేలికగా గెలవాలన్న మోడీ ఆశ నిరాశ కానుంది.రెండవ దాడి మోడీని ప్రో త్సహించి, వెనకేసుకొచ్చిన ఎల్ కె అద్వానీ నుంచి కావడం గమనార్హం.అయితే మోడీ వ్యతిరేకులను కూడగట్టడంలో అద్వానీ విఫలమయ్యారనే చెప్పాలి.
ఇప్పటి వరకూ కేవలం సుష్మా స్వరాజ్ మాత్రమే అద్వానీని బహిరంగంగా సమర్ధిచారు.బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్ధి అయ్యే అర్హతలన్నీ తనకు ఉన్నాయంటూ మోడీ తనను తాను ప్రొజెక్టు చేసుకున్న ముంబెై ర్యాలీకి ఇద్దరూ గెైర్హాజరయ్యారు.ఇది మొదలు మాత్రమే. పెట్రోపెంపుకు నిరసగా దేశవ్యాప్త బంద్‌కు పిలుపిచ్చి వార్తలలోకి ఎక్కుదామని బిజెపి భావించిన తరుణంలో అద్వానీ మరొకసారి దాడి చేశారు.ముంబెైలో మోడీకి పెద్ద పాత్రను ఇచ్చి, అతడి ఒత్తిడికి తలొగ్గి ప్రత్యర్ధి సంజయ్ జోషిని జాతీయ కార్యవర్గం నుంచి తొలగించడంపెై అద్వానీ తన బ్లాగ్‌లో నితిన్ గడ్కరీపెై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.అయితే మోడీ పేరును ప్రస్తావించకుండా గడ్కరీ చేసిన ఇతర వివాదాస్పద నిర్ణయాల పెైనే తన బాణాన్ని అద్వానీ ఎక్కుపెట్టారు. యుపి ఎన్నికల సమయంలో కుశ్వాహాను చేర్చుకోవడం నుంచి జార్ఖండ్ నుంచి అన్షుమన్ మిశ్రాకు రాజ్యసభ టిక్కెట్టు ఇవ్వడం వరకూ అన్ని నిర్ణయాలనూ అద్వానీ తప్పుబట్టారు.ఒకరకంగా ముంబెైలో మోడీ చేసింది తిరుగుబాటే. జోషీని తప్పించడమనేది చివరి నిమిషంలో జరిగింది. మోడీతో శాంతి చేసుకోమని ఆరెస్సెస్ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఎవరినీ సంప్రదించకుండానే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే జరిగిన విధానం మోడీ ఆత్మవిశ్వాసాన్ని పెంచగా, పార్టీలో చీలికలను మరింత ఎక్కువ చేసింది.మోడీ ఎప్పుడూ విభజన శక్తిగానే ఉన్నాడు.
ముంబెైలో ఆయన చేసిన పనితో పార్టీ అంతర్గతంగా రెండుగా విడిపోయింది. విభిజతమై, బలహీనమైన కాంగ్రెస్‌ను సవాలు చేసేందుకు ఐక్యంగా ఉండవలసిన సమయంలో బిజెపిలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం విచారకరమే. ప్రస్తుతం అద్వానీ కూడా వ్యతిరేకం కావడంతో ప్రధాని కావాలని కలలు గంటున్న మోడీకి అది కఠిన పరీక్షే కాగలదు. ప్రస్తుతానికి ఆయన తొలి సవాలు గుజరాత్‌లో విజయం సాధించడం. అక్కడ కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు లేకపోయినప్పటికీ మోడీ సమస్యలు అంతర్గతమైనవి. ముఖ్య ంగా కేశూభాయ్ పటేల్ యుద్ధశంఖారావం పూరించిన నేపథ్యంలో అతడిని తగ్గించడం మోడీ ప్రధాన కర్తవ్యంగా మారింది. కేశూభాయ్ తెరమరుగెైపోతున్నప్పటికీ గుజరాత్‌లో 18శాతం ఓట్ల వాటా కలిగిన పటేల్ వర్గంలో పెద్ద నాయకుడు. 2002 అల్లర్లలో శిక్షపడ్డవారందరూ ఈ వర్గానికి చెందిన వారే కావడం వారిని ఆగ్రహానికి గురి చేస్తోంది. దాదాపు 60 మంది పటేల్స్ అరెస్టు కావడంతో ఆ వర్గం గుజరాత్‌లో భయం నీడన జీవిస్తోందని కేశూభాయ్ వ్యాఖ్యానించారు.సంప్రదాయంగా బిజెపి స్థానంగా ఉన్న ఈ సీటులో బిజెపికి ఓటు వేసేందుకు పటేల్స్ ముందుకు రాలేదు. దీనితో భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది. త్వరలోనే కేశూభాయ్ పటేల్ గుజరాత్‌లో పటేల్ సమ్మేళన్‌ను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ వర్గం ఆగ్రహాన్ని నియంత్రించి వారితో శాంతి చేసుకోకపోతే మోడీ గడ్డుకాలమే ఎదుర్కోనున్నారు. కేవలం కేశూభాయ్ మాత్రమే కాదు గుజరాత్‌లో దీర్ఘకాలం పని చేసి అనుచర గణాన్ని పోగు చేసుకున్న సంజయ్ జోషి కూడా అధికార పోరాటంలో కీలకం అయ్యే అవకాశం ఉంది. మోడీ అతడికి భయపడుతున్నాడు. అందుకే ముంబెై సమావేశం అనంతరం జో షి పర్యటించనున్న ప్రాంతాలకు చెందిన రెైల్వే స్టేషన్లలో స్థాని క ఇంటెలిజెన్స్ వర్గాలను నియమించారు. విషయం తెలుసుకున్న జోషీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.తనకు జరిగిన అవమానాన్ని మరువని జోషి తప్పనిసరిగా మోడీ భవిష్యత్ ప్రణాళికలకు పంటికింద రాయిగా మారుతారు. ఒకవేళ గుజరాత్‌లో గెలిచినా అద్వానీ, సుష్మా, ఇతరుల నుంచి పొంచి ఉన్న సవాళ్ళను మోడీ నిర్వీర్యం చేయగలగాలి. అద్వానీ మోడీని అంత తేలిగ్గా క్షమించకపోవచ్చు. తన కోసం కాకపోయినా తన విధేయుల భవిష్యత్తు కోసమైనా ఆయన ఈ పని చేయవచ్చు. ఇది మోడీని పణంగా పెట్టినప్పుడు మాత్రమే జరుగుతుంది.