NEWS

Blogger Widgets

7.6.12

చురుగ్గా నైరుతి


3,4 రోజుల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు
{పస్తుతానికి కొనసాగుతున్న ఎండతీవ్రత
ఖమ్మం జిల్లాలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత

హైదరాబాద్/విశాఖపట్నం, న్యూస్‌లైన్: నైరుతీ రుతుపవనాలు మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల కిందట కేరళను తాకిన రుతుపవనాలు కర్ణాటక మీదు గా అనంతపురం ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తర్వాత ఇవి క్రమేణా తెలంగాణ, కోస్తా ప్రాంతాలకు విస్తరిస్తాయని పేర్కొన్నారు. అవి రాయలసీమవైపు రావడానికి మూణ్నాలుగు రోజులైనా పడుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ వీఎల్ ప్రసాదరావు పేర్కొన్నారు. రుతుపవనాలు బుధవారమే గోవాతో పాటు కర్ణాటక తీర, ఉత్తర ప్రాంతాలు, దక్షిణ కొంకణ్, దక్షిణ మధ్య మహారాష్ట్రలను, ఈశాన్య భారతమంతటినీ తాకాయి. కేరళ, లక్షదీవుల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కన్నూరు, హోస్‌దుర్గ్, తలిపరం బళలో గడిచిన 24 గంటల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయ్యింది. మరో రెండ్రోజులు ఇదే రీతిలో వర్షాలు పడుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో బుధవారం కూడా అధిక ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రతకు తోడు వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువగానే కనిపించిది. రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడే అవకాశం కన్పిస్తోంది.