జగన్ కు విధించిన ఐదు రోజుల సీబీఐ కస్టడీ నేటితో ముగియడంతో, మరో మూడు రోజులు కస్టడీ పోడగించాలంటు లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఐదు రోజుల కస్టడీలో జగన్ సహకరించలేదంటు, పలు కీలక అంశాలపైన జగన్ సమాధానం చెప్పలేదంటు సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. మరో మూడు రోజులు కస్టడీకి జగన్ ను ఇస్తే కొంత ఉపయోగం ఉంటుదని సీబీఐ చెప్పింది. రేపు హైకోర్టులో సిబిఐ మరోసారి పిటిషన్ దాఖలు చేయనుంది. ఉప ఎన్నికల సందర్భంగా తన వాణిని వినిపించుకునేందుకు అవకాశం కల్పించాలని హైకోర్టులో జగన్ బుధవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఇరువైపుల వాదనలను విన్న కోర్టు విచారణను 21వ తేదికి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో రెండు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. ఉప ఎన్నికలు ఈ నెల 12వ తేదిన ముగుస్తున్నాయి. 10వ తేదినే ప్రచారం ముగుస్తుడడంతో, ఇది జగన్‌కు నిరాశ కలిగించే అంశమేనని అంటున్నారు.