కృష్ణవంశీ ప్రస్తుతం నాని హీరోగా ‘పైసా’ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని యంగ్ పొలిటీషియన్‌గా కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈచిత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు దర్శకుడు కృష్ణవంశీ స్పందించారు. ఈ చిత్రం జగన్‌కు వ్యతిరేకం ఏమాత్రం కాదని, ఎవరినీ ఉద్దేశించి ఈచిత్రం తీయడం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల నేపథ్యంలోనే సినిమా ఉంటుందని, యంగ్ పొలిటిషీయన్‌గా హీరో పాత్ర ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
|