NEWS

Blogger Widgets

7.6.12

ఫేస్‌బుక్, గూగుల్‌కు నోటీసులు జారీ చేసిన కోర్టు



Facebook

కేంద్ర ప్రభుత్వంతో పాటు ఫేస్‌బుక్ ఇండియా, గూగుల్ ఇండియాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ మాజీ నేత కె.ఎన్.గోవిందాచార్య ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. భారత్‌లో నిర్వహిస్తున్న కార్యకలాపాల నుంచి పొందుతున్న ఆదాయంపై ఫేస్‌బుక్ ఇండియా, గూగుల్ ఇండియాల నుంచి పన్నులు వసూలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని గోవిందాచార్య తన పిల్‌లో కోర్టును అభ్యర్థించారు. 


సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను వినియోగిస్తున్న 50 మిలియన్ల మంది భారతీయుల డాటాకు భద్రత కల్పించేలా ఆదేశించాలని కూడా గోవిందాచార్య తన పిల్‌లో కోరారు.

ఈ పిల్‌పై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈ రెండు సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ‘ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలి. కేంద్రం నాలుగు వారాల్లోగా తన సమాధానం ఇవ్వాలి’ అని న్యాయమూర్తులు విపిన్ సంఘీ, రాజీవ్ షక్ధర్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.