కింగ్ నాగార్జున హీరోగా కె. అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో డా. వెంకట్ నిర్మిస్తున్న ‘డమరుకం’ చిత్రం జూలై రెండో వారంలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ....‘నా కెరీర్లోనే మొదటి సారి ఇలాంటి ఫాంటసీ మూవీ చేస్తున్నాను. హై టెక్నికల్ వేల్యూస్‌తో చేశారు. నా కెరీర్లోనే హై బడ్జెట్ మూవీ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇది నాకు చాలా పెద్ద రేంజ్ సినిమా అవుతుంది’ అన్నారు. |