అల్లు అర్జున్-ఇలియానా జంటగా నటించిన సినిమా ‘జులాయి’. డారాజేంద్రప్రసాద్ కీలకపాత్రధారి. త్రివిక్రమ్ దర్శకుడు. డి.వి.వి.దానయ్య సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపెై ఎన్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 2పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 10న ఆడియో రిలీజ్ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘బన్ని-ఇల్లూ జోడీ బాగా కుదిరింది. నాయకానాయికల మధ్య రొమాన్స్ చూడముచ్చటేస్తుంది. త్రివిక్రమ్ దర్శత్వ ప్రతిభ హైలెైట్. సంభాషణలు మరోసారి పంచ్ విసరనున్నాయి. బన్ని పాత్రలోని ఎనర్జీ అద్భుతం. దేవీశ్రీ కెవ్వు కేక ఆడియో ఇచ్చారు. బన్ని-దేవి కాంబినేషన్‌లో మరో హిట్ ఆడియో వస్తుంది. ఈ నెల 29న సినిమా రిలీజ్ చేస్తున్నార’’ అన్నారు. నటనకి ఆస్కారమున్న పాత్రలో నటించానని ఇలియానా తెలిపారు.
|