కాంగ్రెస్ పార్టీని వీడటంతోనే జగన్ అరెస్టయ్యాడని ఆయన కుటుంబీకులు చేస్తున్న వ్యాఖ్యలను లగడపాటి తిప్పికొట్టారు. కాంగ్రెసులో ఉన్నా వైయస్ జగన్ జైలుకు వెళ్లేవాడని ఆయన అన్నారు.
ఏ పనిలోనైనా సగం వాటా కోరే వైయస్ జగన్ మిస్టర్ ఫిఫ్టి పర్సెంట్ లగడపాటి ఎద్దేవా చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డిని తిట్టినవారిని జగన్ తన పార్టీలో చేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. అవినీతి, స్వార్థం, అసత్యం లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పనిచేస్తోందని లగడపాటి విమర్శించారు.