అగ్రరాజ్యం అమెరికా సైన్యంలో ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయి. ఈ సంఖ్య గత పదేళ్ల కంటే ఎక్కువగా ఉన్నట్టు ఆ దేశ రక్షణ కార్యాలయమైన పెంటగాన్ అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. పెంటగాన్ లెక్కల ప్రకారం 2012లో కేవలం 155 రోజుల్లో 154 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 50 శాతం మందికి పైగా ఆప్ఘనిస్థాన్ సైనిక స్థావరాల్లో పని చేస్తున్న వారు సైనికులు ఉండటం గమనార్హం.
ఇరాక్, ఆప్ఘనిస్థాన్ దేశాల్లో పని చేస్తున్న సైనికులకు స్థానికంగా ఎదురవుతున్న సమస్యలే ఈ ఆత్మహత్యలకు ప్రధానకారణమై వుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే లైంగిక వేధింపులు, మద్య సేవనం, ప్రాంతీయ విద్వేషాలతో పాటు.. ఇతర సమస్యలు కూడా కారణాలుగా చెపుతున్నారు.
దీనిపై పెంటగాన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డిఫెన్స్ సుసైడ్ ప్రివెన్షన్ ఆఫీస్ అధిపతి జాకీ గారిక్ స్పందిస్తూ... సైనికుల్లో ఆత్మహత్యల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే అంశంగా ఉందన్నారు. అలాగే రిటైర్డ్ జనరల్, సైక్రియాట్రిస్ట్ డాక్ట్ర స్టీఫెన్ జెనాకిస్ మాట్లాడుతూ...ఈ ఆత్మహత్యలు అమెరికా ఆర్మీలో ఉద్రిక్తతలకు దారితీసి ఆప్ఘనిస్థాన్‌ను వీడి వెళ్లేలా చేస్తుందని ఆయన చెప్పారు.