NEWS

Blogger Widgets

8.6.12

సూసైడ్ బాంబర్స్‌ ఉద్యోగానికి అభ్యర్థులు కావలెను?


terrorists
File
FILE
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన తర్వాత ఆ సంస్థ నిర్వీర్యమైపోయిందంటూ అగ్రరాజ్యం అమెరికా ప్రకటనలపై ప్రకటనలు గుప్పిస్తోంది. మరోవైపు.. తమ సంస్థలో పని చేసేందుకు ఔత్సాహికులైన అభ్యర్థులు కావాలంటూ అల్‌ఖైదా సంస్థ ఇంటర్నెట్‌తో పాటు.. పలు మార్గాల్లో ప్రకటనలు గుప్పిస్తోంది. ఈ ప్రకటనల్లోనే ఏకంగా ఎంపికైన వారికి సూసైడ్ బాంబర్స్‌గా ట్రైనింగ్ ఇస్తామంటూ స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. 

వాస్తవానికి అల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థలు అభ్యర్థులను రహస్యంగా ఎంపిక చేసేవి. అయితే, ఇటీవలి కాలంలో ఆ సంస్థలు కూడా అందుబాటులో ఉన్న హైటెక్ టెక్నాలజీని ఉపయోగించుకుని రిక్రూట్మెంట్లు నిర్వహించడం గమనార్హం. ఆసక్తి గల అభ్యర్థులు తమ సంస్థలో చేరేందుకు బయోడేటా పంపాలంటూ ఏకంగా ఇంటర్నెట్‌లో అడ్వర్టైజ్‌మెంట్‌లో అల్‌ఖైదా సంస్థ తాజాగా ఇచ్చింది. అంతేకాదు విధ్వంసం సృష్టించడంలో కొంచెం అనుభవం ఉంటే అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ అందులో పేర్కొంది. ఈ ప్రకటన జిహాదీ వెబ్‌సైట్స్‌లకు యాడ్ రూపంలో ఇచ్చింది.