NEWS

Blogger Widgets

8.6.12

శ్రీకాంత్ నిజంగా లక్కీ


శ్రీకాంత్ హీరోగా ‘లక్కీ’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. మేఘన ఇందులో నాయిక. రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై ఛాయాగ్రాహకుడు, నిర్మాత వి.శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సాయికార్తీక్ స్వరసారథ్యం వహిస్తున్న ఈ చిత్రం పాటల రికార్డింగ్ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘కృష్ణగారితో అమ్మదొంగ, జగదేకవీరుడు, బాలకృష్ణతో పవిత్రప్రేమ, కృష్ణబాబు, సౌందర్యతో ‘ఆరోప్రాణం’ చిత్రాలను నిర్మించిన నేను కొంత విరామం తర్వాత నిర్మిస్తున్న సినిమా ఇది. మా సంస్థ ఇమేజ్‌ను పెంచే విధంగా సినిమాను నిర్మిస్తాం’’ అని తెలిపారు. ఈ నెల 13న షూటింగ్ ప్రారంభిస్తామని, జూలై, ఆగస్ట్ నెలల్లో జరిగే షెడ్యూల్స్‌తో షూటింగ్ పూర్తవుతుందని, దసరా కానుకగా సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు.

జయసుధ, రోజా, బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, సన, ధనరాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించనున్ను ఈ చిత్రానికి మాటలు: పడాల, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, ఎడిటింగ్: నాగినీడు, ప్రొడక్షన్ కంట్రోలర్: వేణు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ముదిగొండ వెంకటేష్.