- అక్రమ జీవోలపై 'సుప్రీం'లో పిటిషన్
వైఎస్ హయాంలో వెలువడ్డ 26 అక్రమ జీవోలకు నాటి మంత్రివర్గ సభ్యులందరినీ బాధ్యులను చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక ఇంప్లీడ్ పిటిషన్ దాఖలైంది. ఈ జీవోలకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ పాటికే ఆరుగురు రాష్ట్ర మంత్రులకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. నాటి జీవోలకు మంత్రివర్గ సభ్యులందరినీ బాధ్యులను చేయాలని కోరుతూ సుధాకరరెడ్డి అనే న్యాయవాది గురువారం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. జీవో ఏ శాఖకు సంబంధించినదైనప్పటికీ మంత్రివర్గ నిర్ణయాలకు మంత్రులందరినీ బాధ్యులను చేయాలని తన పిటిషన్‌లో ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నాటి వైఎస్ మంత్రివర్గంలోని మంత్రులందరినీ విచారించాలని ఆయన కోరారు.