హైదరాబాద్ (వి.వి) : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సత్యం కంప్యూటర్ కంపెనీ ప్రమోటర్స్ కుటుంబ సభ్యుల పేరుల మీదున్న 44 ఆస్తుల స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రంగారెడ్డి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో వున్న ఈ ఆస్తుల విలువ రూ.2.48 కోట్లు. సిబిఐ విజ్ఞప్తి మేరకు ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌ను ప్రభుత్వం ఆమోదించింది. ఇంతకుముందు ఇదే వ్యక్తులకు చెందిన రూ.3.87 కోట్ల ఆస్తులను కూడా అటాచ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ 44 ఆస్తులు సత్యం కంప్యూటర్స్ కంపెనీ ప్రమోటర్స్ అయిన కుటుంబ సభ్యులకు చెందిన 7 ఫ్రంట్ కంపెనీల పేర్లు మీద రిజిస్టరైవున్నాయి.